
అఖిల్ రెండో చిత్రానికి ...రెండు టైటిల్స్ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: త్వరలోనే అఖిల్ ..తన రెండో సినిమాను స్టార్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుంది. కథతో పాటు టోటల్ స్క్రీన్ ప్లేను పూర్తిచేశాడు విక్రమ్ కుమార్.
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఏప్రియల్ మొదటి వారంలో అఖిల్-విక్రమ్ కుమార్ సినిమా ప్రారంభం అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టైటల్ ఒకటి మీడియా సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.అందుతోన్న సమాచారం ప్రకారం...ఆ చిత్రం టైటిల్ 'జున్ను'.
అయితే ఈ టైటిల్ ని ఇంకా రిజిస్టర్ చేయలేదు. నాగార్జున కూడా ఓకే అనుకున్నాక ముందుకు వెళ్దామని డిసైడ్ చేసుకున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క ఈ చిత్రానికి 'హలో గురు ప్రేమ కోసమే' అనే టైటిల్ ని సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ ని ఆల్రెడీ రిజిస్టర్ చేసారు. ఇక అఖిల్ రెండో చిత్రం లాంచ్ కోసం డిసెంబర్ 2015 నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు. అఖిల్ తొలి చిత్రం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఈ రెండో చిత్రాన్ని అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించనున్నాడు. నిజానికి ఈ పాటికే అఖిల్-విక్రమ్ కుమార్ సినిమా సెట్స్ పైకి రావాల్సింది. కానీ అంతలోనే విక్రమ్ కుమార్ పెళ్లికి రెడీ అయిపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అఖిల్ కూడా పెళ్లికి రెడీ అయిపోయాడు. తను ఎంతగానో ప్రేమించిన శ్రియ భూపాల్ తో నిశ్చితార్థం కానిచ్చేశాడు. కానీ ఈ లోగా బ్రేకప్ అవటంతో... ఇప్పుడు సినిమాపై ఫోకస్ పెట్టాడు.
No comments
thank u for comment