
అమీజాక్సన్ పేరు చెబితే చాలు యువకుల గుండెల్లో గుబులు పుడుతుంది. స్వతహాగా బ్రిటిష్ కు చెందిన అమ్మాయి కావడంతో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడకుండా, తన అందాలతో ఎప్పుడు మీడియాలో కనిపిస్తుంది. సినిమాల్లోనే కాదు, బయట కూడా ఈ అమ్మడు అందాల ప్రదర్శన భారీగా చేస్తుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 2.0లో నటిస్తున్నది. తాజాగా ఈమెకి కోలీవుడ్లో మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.
వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్, దర్శకుడు గోకుల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో అమీజాక్సన్ నుఎమ్పిక చేయాలనీ భావిస్తున్నారట. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపాడట దర్శకుడు. అమీ కూడా ఈ సినిమాలో చేసేందుకు సిద్దమే అన్నట్లుగా మాట్లాడినట్లు తమిళ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం విజయ్ త్రిషతో 96.. సమంతతో అనీతి కథైగళ్ చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి కాగానే.. గోకుల్ డైరెక్షన్ లో మూవీ స్టార్ట్ చేస్తాడని తెలుస్తోంది.
No comments
thank u for comment